కొందరు సరస్వతులు నిజంగా చదువుల తల్లులుగా ఉంటారు, వారు జీవితంలో ఎంతో కష్టపడి ఉన్నత స్ధానాలకు చేరుకుంటారు, ఎంతో పేదరికంలో పుట్టి నేడు పెద్ద పెద్ద స్దితిల్లోకి వెళ్లిన వారు కూడా ఉన్నారు, అలాంటి అమ్మాయి స్టోరీ ఇది.
ఈ బాలిక ఫుట్ పాత్ పైనే జన్మించింది. ఆ ఫుట్ పాత్ వేదికగానే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించింది, ఆమె పదో తరగతి వరకు కష్టపడి చదివింది. పది ఫలితాల్లో 68 శాతం మార్కులు సాధించింది అంతేకాదు ఆమ తల్లిదండ్రులు ఎంత ఆనందించారు. సొంత ఇల్లు లేకపోయినా ఆమె అలా విద్యాభ్యాసం చేసింది.
అయితే ఆమె సాధించిన ఈ ఘనతకు అక్కడ మున్సిపాలిటీ అధికారులు.. ఇల్లును ఇచ్చారు. దశరథ్ అనే వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు రోజు కూలీ పని చేసుకుంటారు, వీరు సొంత ఇల్లు లేక పుట్ పాత్ పైనే ఉంటున్నారు, ఇలా వీరికి ముగ్గురు పిల్లలు ఇక్కడే పుట్టారు.
వీరి కుమార్తె భర్తీ ఖండేకర్.. పట్టుదలతో చదవాలనుకుంది. అలా తన విద్యను పది వరకు కొనసాగించింది. ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో 68 శాతం మార్కులు సాధించి.. తన కలను నెరవేర్చుకుంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ మున్సిపాలిటీ వారు ఆమె గురించి తెలుసుకుని వారికి ఓ ఇంటిని ఇచ్చారు, ఇక వారు అక్కడే ఉండనున్నారు, ఆమె ఐఏఎస్ అవుతాను అని తెలిపింది.