ఎవరి జీవితంలో అయినా పెళ్లి రోజు పుట్టినరోజున ఓ పండుగలా జరుపుకుంటారు, అయితే ఓ భర్త తన భార్య పై ప్రేమతో ఆమె పుట్టిన రోజున ఓ మంచి గిఫ్ట్ ఇచ్చాడు, అయితే ఇది మానవత్వపు గిఫ్ట్
భార్యా, పిల్లల పుట్టిన రోజు వస్తే అన్నదానమో, డబ్బు సాయం చేస్తుంటారు. కానీ ఇతను మాత్రం తనకు రావాల్సిన షాపుల అద్దెను రద్దు చేసి ఔదార్యాన్ని చాటుకున్నాడు.
దీంతో వారు అందరూ సంతోషించారు, ఆమెని కూడా దీవించారు, ఈ లాక్ డౌన్ వల్ల వ్యాపారాలు లేవు, దీంతో అద్దె తీసుకోవడం కూడా కొందరు మానేశారు, ఈ సమయంలో వారి నుంచి అద్దె తీసుకోకుండా ఉండండి అని భార్య భర్తకు చెప్పింది.
దీంతో వారి నుంచి ఎలాంటి అద్దె తీసుకోలేదు ఆ భర్త..తనకు ప్రతీ నెలా రావాల్సిన రూ.1 లక్ష ను రద్దు చేశాడు. దీంతో ఆ షాపులు అద్దెకు తీసుకున్నవాళ్లు సంతోషం వ్యక్తంచేశారు.
చెన్నై మాధవరం నెహ్రూ వీధికి చెందిన ఏలుమలై ఈ నిర్ణయం తీసుకున్నాడు, మొత్తం 14 షాపుల అద్దె రద్దు చేశాడు.వాటిలో ఫొటో స్టూడియో, సెలూన్, జిరాక్స్ వంటి పలు షాపులు ఉన్నాయి. ఆమె పుట్టిన రోజున ఈ నిర్ణయం తీసుకున్నాడు.