బస్సెక్కిన ఓ వ్యక్తికి కరోనా సోకిందని తెలియడంతో అతన్ని బస్సులోనుంచి దింపేశారు… అలాగే అతడితోపాటు ఉన్న అతడి భార్య కూడా రొడ్డుపైనే భర్తను వదిలి పారిపోయింది… ఆ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోజరిగింది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… రామచంద్రాపురానికి చెందిన 55 ఏళ్ల ఒక వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసీస్ చేయించుకుంటున్నాడు…
రెండురోజుల క్రితం అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు.. కాకినాడ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకున్న బాధితుడు నిన్న సాయంత్రం ఆసుపత్రి నుంచి భార్యతో కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు కాకినాడ ఆర్టీసీ బస్సెక్కాడు… బస్సులో ఆర్టీసీ సిబ్బంది అతడి వివరాలు నమోదు చేసుకున్నారు.. బస్సు కరప చేరుకుంటుందనగా బాధితుడికి కరోనా సోకినట్లు రిపోర్టులు వచ్చాయి..
రిపోర్టులు వచ్చే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని సూచించినా వినిపించుకోకుండా వారు బస్సెక్కి వచ్చారు… దీంతో వారు ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు… వారు బస్సు డ్రైవర్, కండెక్టర్ కు సమాచారం అందించారు… దీంతో వారికి విషయం చెప్పి బస్సు నుంచి దించేయ్యాలని సూచించారు… అప్పటికే బస్సు కరప మార్కెట్ సెంటర్ కు చేరుకుంది అక్కడ భార్య భర్తలిద్దరిని దింపేశారు…
అయితే భర్తతో పాటు దిగిన భార్య కనిపించకుండా పోవడంతో భాదితుడు అక్కడే ఉండిపోయాడు… సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు… కనిపించకుండా పోయిన అతడి భార్యకోసం పోలీసులు గాలిస్తున్నారు…