భార్య పై పెంచుకున్న ప్రేమతో చివరకు భర్త ఇలా

భార్య పై పెంచుకున్న ప్రేమతో చివరకు భర్త ఇలా

0
73

చాలా మంది తమ భార్యలను చాలా ఇష్టంగా చూస్తారు, తనే జీవితంగా భావించే వారు ఉంటారు, అయితే
గర్భంతో ఉన్న భార్య మరణాన్ని ఆ భర్త తట్టుకోలేకపోయాడు. చివరకు దారుణంగా నువ్వు లేకుండా ఈ లోకంలో నేను బతకలేను..నీ వెంటే నేను అంటూ భార్య చితిలో దూకి ప్రాణాలు అర్పించాడు ఆ భర్త.

ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని గోండ్పిప్రి తహసీల్లోని భాంగ్రామ్ తలోధి గ్రామంలో జరిగింది.కిషోర్ ఖాతిక్ అనే యువకుడికి మార్చి 19న రుచితా చిట్టావర్ తో పెళ్లి జరిగింది. పెళ్లిఅయ్యి ముచ్చటగా మూడు నెలలైంది.

ఇప్పుడు ఆమె మూడు నెలల గర్భిణీ, ఇక ఆమె తల్లి అనారోగ్యంతో ఉండటంతో ఆమెని చూసేందుకు రుచిత అక్కడకు వెళ్లింది. కిషోర్ ఇక ఆమెని తీసుకురావడానికి వెళ్లాడు, కాని ఆమె ఇంటిలో లేదు, దీంతో కంగారుగా అంతా వెతికారు.. చివరకు ఆ గ్రామానికి సమీపంలో ఉన్న ఓ బావిలో రుచితా మృతదేహాన్ని చూసి షాకయ్యారు.

రుచితా అంత్యక్రియలు సోమవారం నిర్వహించారు. ఆమె చితికి నిప్పు పెట్టిన కాసేపటికే కిషోర్ కూడా ఆ చితిలోకి దూకాడు. అక్కడున్న వారంతా అతన్ని రక్షించారు.ఇంటికి వచ్చాడు కానీ భార్య జ్ఞాపకాలతో తల్లడిల్లిపోయాడు. నడుచుకుంటూ తన భార్య ఆత్మహత్య చేసుకున్న బావి వద్దకు వెళ్లి బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. అయితే ఆమె ఎందుకు చనిపోయింది ఆత్మహత్యా హత్య అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.