భార్య గర్భవతిగా ఉన్నపుడు ఎందుకు భర్త కొబ్బరికాయ కొట్టకూడదు

భార్య గర్భవతిగా ఉన్నపుడు ఎందుకు భర్త కొబ్బరికాయ కొట్టకూడదు

0
157

ఇక మనకు అనాదిగా వస్తున్న ఆచారాలు మనం పాటిస్తూ ఉంటాం, ఇందులో మరీ ముఖ్యంగా ఇంటిలో మహిళ గర్బవతి అయితే అనేక ఆచారాలు ఉంటాయి, ఇక భర్తకి కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, వాటిని పాటిస్తూ ఉంటారు.

అయితే భార్య గర్భవతిగా ఉన్న సమయంలో కొబ్బరికాయ కొట్టకూడదు అంటారు..నిజమే శాస్త్ర ప్రకారం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టకూడదు. ఎందుకంటే 3 వ నెల వచ్చిన తర్వాత ఆ గర్భంలో ఉన్న శిశువు ప్రాణం పోసుకుంటుంది, అందుకే ఈ సమయంలో కొబ్బరికాయ కూడా పూర్ణ ఫలము కాబట్టి విచ్చిన్నం చేయద్దు అంటారు.

అది కూడా ఒక జీవుడితో, ఒక ప్రాణముతో సమానముగా మన పూర్వీకులు చెప్పి ఆరోజు నుంచి ఇలా కొబ్బరికాయ కొట్టద్దు అంటారు, అయితే ఇలా ఎవరైనా తెలియక కొబ్బరికాయ మర్చిపోయి దేవాలయాలు పూజల్లో కొడితే మాత్రం దీనికి కంగారు పడవద్దు.. ఇలా చేస్తే వెంటనే ఓ కొబ్బరి మొక్కని నాటితే మంచిది. కాని గర్భవతిగా ఉన్న సమయంలో కొబ్బరికాయ మాత్రం కొట్టవద్దు.