ఈ కరోనా సమయంలో కొందరు భార్య భర్తలు తమ అఫైర్లను దాచుకోలేకపోయారు.. చివరకు అడ్డంగా ఇరుక్కున్న ఘటనలు ఉన్నాయి.తనకు కరోనా సోకిందని, ఇక బతకబోనని భార్యకు ఫోన్ చేసి, ఆపై దాన్ని స్విచ్చాఫ్ చేశాడు భర్త. అయితే భార్యకి అనుమానం వచ్చింది, అసలు తన భర్త ఎక్కడ ఉన్నాడా అని ఆందోళన చెందింది.
ఈ ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది. కాని ఇన్ని విషయాలు చెప్పిన ఈ భర్త చివరకు ప్రియురాలితో కలిసి ఉన్నాడని పోలీసులు తేల్చిచెప్పారు.ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న మనీశ్ మిశ్రా, జూన్ లో తన భార్యకు ఫోన్ చేసి, కరోనా పాజిటివ్ వచ్చిందని, చెప్పాడు దీంతో భార్య కంగారు పడింది.
వెంటనే భర్త ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానంతో పోలీసులకు చెప్పింది, అయితే ఆ ఫోన్ ఎక్కడ స్విఛ్చాప్ అయింది ఇలా అన్నీ పోలీసులు తమ కోణంలో విచారించారు..
మనీశ్ మిశ్రా, ఓ మహిళతో కలిసి కారులో వెళుతున్నట్టు సీసీ టీవీలో గుర్తించి, అతని గత చరిత్రపై విచారించారు, ఓ మహిళతో వివాహేతర బంధం ఉన్నట్టు తేలిపోయింది. ఇక ప్రియురాలితో ఇండోర్ లో అతను ఉన్నాడు అని తేల్చారు. చివరకు అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు భార్యకి అప్పగించారు.