ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారుతుందా కొత్త డేట్ వైర‌ల్ ?

Will the RRR movie release date change the new date viral?

0
145

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా కాస్త డౌట్లు వ‌స్తున్నాయి అభిమానుల‌కి . అనుకున్న స‌మ‌యానికి సినిమా విడుద‌ల అవుతుందా లేదా ఇంకా స‌మ‌యం తీసుకుంటారా అనేది అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు దేశీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన చాలా మంది సినిమా అన‌లిస్టులు కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో ఆలోచ‌న చేస్తున్నారు. దీనికి కార‌ణం ఉంది అంటున్నారు.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. ఈ నెలాఖరుకు ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి.ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసారు చిత్ర యూనిట్. వేగంగా ప‌నులు అన్నీ జ‌రుగుతున్నాయి.

ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే యేడాది జనవరి 26న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కొత్త వార్త‌లు వినిపిస్తున్నాయి.
అన్ని భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పర్యవేక్షించాలి. అంతా రాజ‌మౌళి చూసుకోవాలి ఇది కూడా చాలా స‌మ‌యం ప‌డుతుంది.ఇక తెలుగుతో పాటు ఈ సినిమా హిందీ, తమిళంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వాళ్ల పాత్రలకు వాళ్లే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.

చూడాలి ఈ వార్త‌లు వినిపిస్తున్నాయి. కాని రాజ‌మౌళి టీమ్ నుంచి ఏమైనా అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కూ దేనిని న‌మ్మ‌లేము.