ఈ మహిళలు చేసిన త్యాగానికి హ్యాట్సప్ చెప్పాల్సిందే

ఈ మహిళలు చేసిన త్యాగానికి హ్యాట్సప్ చెప్పాల్సిందే

0
101

ఆడవారికి జుట్టే అందం అంటారు… జుట్టు ఎదగడం కోసం రకరకాల షాంపులను వాడుతుంటారు… జడ వేసుకునే టప్పుడు కొంచం జుట్టు రాలితే చాలు లక్షల్లో నష్టపోయినట్లు బాధపడే అమ్మాయిలు జుట్టును దానం చేయడం అరుదుగా చూస్తుంటారు… కొంతమంది అయతే ప్రాణం అయినా ఇస్తాము కానీ జుట్టును మాత్రం ఇవ్వమని అంటున్నారు…

అలాంటిది 80 వేల మంది మహిళలు తమ జుట్టును దానం చేశారు.. ఎందుకు దానం చేశారో తెలిస్తే నింజగానే వారిని అభినందిస్తారు… దేశంలో చాలామంది క్యాన్సర్ బారిన పడిన మహిళలకు జుట్టురాలిపోతుందని అలాంటి వారికి తాము జుట్టుతో విగ్స్ ను తయారు చేసి ఇస్తామని తాజాగా వినోదిని అనే మహిళ చెప్పింది…

గతంలో క్యాన్సర్ తో మరణించిన ఒక మహిళను చూశానని ఆమెకు జుట్టులేదని అందుకే తమ జుట్టును ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపింది… కాలేజిలో ఉన్న ప్రతీ ఒక్కరు కొంత బాగాన్ని జుట్టు ఇస్తారని దాన్ని విగ్స్ గా తయారు చేసి ఇస్తామని చెప్పింది… ఇప్పటివరకు 80 వేల మంది జుట్టును దానం చేశారని తెలిపింది..