వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు ఇవి ఎక్కువ చూస్తున్నార‌ట

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు ఇవి ఎక్కువ చూస్తున్నార‌ట

0
133

ఈ లాక్ డౌన్ వేళ చాలా వ‌ర‌కూ అంద‌రూ ఇంటికి ప‌రిమితం అయి అక్క‌డే వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు.. చాలా కంపెనీలు ఉద్యోగుల‌కి ఇలాంటి అవ‌కాశం క‌ల్పించాయి. ఈ స‌మ‌యంలో ప‌లు సంస్ద‌లు ఉద్యోగుల‌కి జీతాలు కూడా చెల్లించాయి, అయితే ఇంటి నుంచి పని చేసే ఉద్యోగుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు పోర్న్ వీడియోలు, సమాచారాన్ని చూస్తున్నారని స‌ర్వే రిపోర్టులో తేలింది.

చాలా వ‌ర‌కూ ఉద్యోగులు దాదాపు రెండు గంట‌లు అయినా వీటిపై స‌మ‌యం కేటాయిస్తున్నార‌ట.‌
18 శాతం మంది తమ కంపెనీ అందించిన డివైజ్‌లలో చూస్తున్నారని… 33 శాతం మంది తమ వ్యక్తిగత డివైజ్(ల్యాప్ ట్యాప్, మొబైల్)లో పోర్న్ వీడియోలు చూస్తున్నారని తాజాగా వ‌చ్చిన రిపోర్టు చెబుతోంది,దీనిపై కంపెనీలు వారికి మెయిల్స్ కూడా పంపించాయ‌ట‌.

ఇలా ఇష్టం వ‌చ్చిన వెబ్ సైట్లు ఓపెన్ చేస్తే, వ‌ర్క్ గురించి జాగ్రత్త వహించకపోతే మాల్‌వేర్ వైరస్‌లు అటాక్ చేసే ప్రమాదముంది. సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడంతో ఐటీ నుంచి వచ్చే ప్రమాదాలను పెంచుతుందని వార్నింగ్ ఇచ్చార‌ట‌.