యాగంటి క్షేత్రంలో ఎక్కడా కాకులు ఎందుకు కనిపించవు దానికి కారణం.

యాగంటి క్షేత్రంలో ఎక్కడా కాకులు ఎందుకు కనిపించవు దానికి కారణం.

0
83

యాగంటి క్షేత్రం మన దేశంలో ఎంతో పుణ్య క్షేత్రంగా ఉంది, ఈ క్షేత్రం కర్నూలు నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు జిల్లా బనగాన పల్లి, నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి సులువుగా వెళ్లవచ్చు.

ఇక్కడ ఉన్న నందివిగ్రహం ఇప్పటికీ నిత్యం పెరుగుతూనే ఉంటుంది, దీని వెనుక అనేక కథలు చెబుతారు,కలియుగాంతంలో యాగంటిలోని ఈ నంది లేచి రంకెలేస్తుందని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో వెల్లడించారు. అందుకే ఇక్కడి నంది రోజు రోజుకు పెరుగుతుందని భక్తుల విశ్వాసం.

అలాగే యాగంటి క్షేత్రంలో ఎక్కడా కాకులు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్యుడు.. విగ్రహం బొటన వేలు విరగడం వెనుక తన లోపాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేశాడు, అయితే ఈ సమయంలో ఆయన తపస్సు చేస్తున్నసమయంలో వందలాది కాకులు ఆయన తపస్సుకి అడ్డుతగిలాయి. అరుపులు అరిచాయి, దీంతో ఆయన ఒక్క కాకి కూడా ఇక్కడ కనిపించకూడదు అని శపించారు, అందుకే నాటి నుంచి నేటి వరకూ ఒక్క కాకి కూడా ఇక్కడ కనిపించదు.