యజమాని కోసం చిలుక సాక్ష్యం ప్రపంచంలో అరుదైన కేసు

యజమాని కోసం చిలుక సాక్ష్యం ప్రపంచంలో అరుదైన కేసు

0
89

చిలుక జోస్యం చెప్పడం తెలుసు, కాని సాక్ష్యం కూడా చెబుతాయి అనే విషయం తెలుసా, తన యజమాని పెంచుకునే చిలుక చివరకు తన యజమాని హత్య కేసులో నిజం చెప్పేందుకు కోర్టుకు వెళుతోంది, అంతేకాదు పోలీసులు ఆ చిలుకని సాక్యంగా చెబుతున్నారు.

ఈ వింత అరుదైన ఘటన తూర్పు అర్జంటీనాలోని జరిగింది, ఓ మహిళ నన్ను కాపాడండి అని అరుస్తున్న అరుపులు వినిపించాయి, ఈ అరుపులు విన్న ఓ పోలీస్ అపార్ట్ మెంట్ కు వెళ్లారు. అక్కడ ఓ మహిళ నగ్నంగా చంపేసి ఉంది, అక్కడ చిలుక అరుపులు అరుస్తోంది, వద్దు.. ప్లీజ్ నన్ను వదిలేయ్ అని చిలుక అరిచింది.

తన యజమాని చివరగా ఈ అరుపులు అరిచింది.. అందుకే చిలుక అరిచింది అని పోలీసులు నిర్దారించారు, అయితే ఆమె రూమ్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులపై అనుమానంతో కేసు విచారణ చేశారు, అందులో ఓ వ్యక్తిపై అనుమానంతో అతనిని అరెస్ట్ చేశారు, ఈ సమయంలో చిలుక సాక్ష్యం సేకరించారు, అంతేకాదు ఆమె ఒంటిపై పంటి గాటులు ఇలా అన్నీ ఆధారాలు సేకరించారు