యజమానికి చేసిన సాయానికి గుమస్తాకు అదిరిపోయే గిఫ్ట్ – నువ్వు గ్రేట్ సామీ

యజమానికి చేసిన సాయానికి గుమస్తాకు అదిరిపోయే గిఫ్ట్ - నువ్వు గ్రేట్ సామీ

0
96

కేరళలో ఒరంగుల్ స్వామి అనే వ్యక్తి ఓ స్పైసెస్ కంపెనీలో పని చేస్తున్నాడు, అయితే అతని యజమానికి అర్జెంట్ గా ఆపరేషన్ జరుగుతోంది.. ఈ సమయంలో అతనికి అవసరమైన రక్తం ఎక్కడ వెతికినా దొరకలేదు, ఈ సమయంలో ఒరంగుల్ స్వామిది కూడా అదే బ్లడ్ గ్రూప్ కావడంతో అతను తన యజమానికి రక్తం ఇచ్చాడు.

దీంతో అతను చేసిన సాయానికి ఆకుటుంబం ఎంతో సంతోషించింది, దాదాపు 15ఏళ్లుగా గుమస్తాగా నర్వీన్ దగ్గర పనిచేస్తున్నాడు స్వామీ, అయితే తన తండ్రి ప్రాణాలు కాపాడినందుకు ఒరుంగల్ కు ఏదైనా సాయం చేయాలి అని భావించాడు నర్వీన్ కుమారుడు సమీర్.

అయితే ఒరుంగల్ కు ఇద్దరు కుమార్తెలు, అందులో పెద్ద కుమార్తె ఆశా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది, అయితే ఆమెని తాను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు సమీర్, దీంతో అంత పెద్ద కోటీశ్వరుడు కుమారుడు నాకు అల్లుడు అవ్వడం చాలా ఆనందం నా కూతూరు సంతోషంగా ఉంటుంది అని ఆనందించాడు స్వామి, ఈ లాక్ డౌన్ వేళ తన ఆఫీసులోనే ఈ వివాహం సింపుల్ గా జరిపించారు, తన తండ్రి కోలుకున్న నెల రోజులకి ఈ వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచాడు సమీర్.