యజ్ఞోపవీతం– జంధ్యం ఎందుకు వేసుకుంటారు దీని వెనుక రీజన్

యజ్ఞోపవీతం-- జంధ్యం ఎందుకు వేసుకుంటారు దీని వెనుక రీజన్

0
293

చాలా మంది పురుషులు యజ్ఞోపవీతం జంధ్యం ధరించే సంప్రదాయం మనకి కనిపిస్తూ ఉంటుంది, ఇది హిందువుల్లో చాలా మంది వేసుకుంటారు, అయితే కొన్ని కులాల వారు మాత్రమే ఇలా జంధ్యం వేసుకుంటారు, దీని వెనుక కారణం తెలుసుకుందాం.

హిందుమతంలో బాలురు వేదభ్యాసం ప్రారంభించే ముందు చేసే ప్రక్రియనే ఉపనయనం అంటారు, అంతేకాదు దీనినే ఒడుగు అని పిలుస్తుంటారు. బాల్య దశ నుండి బ్రహ్మచారిగా మారే సమయంలో ఉపనయనం చేస్తారు. అప్పటి వరకూ నియమాలను పాటించని బాలురు ఉపనయనం చేసిన తర్వాత ఎంతో నిష్టతో నియమాలను పాటించవలసి ఉంటుంది. అందుకే దీనిని అంత నిష్టగా చేస్తారు.

యజ్జోపవీత ధారణ చేస్తేనే వేదాలను అభ్యసించడం అలాగే పితృ సంస్కారాలు చేసే అధికారం వస్తుందని మనుధర్మం చెబుతుంది. ..అయితే ఈ జంధ్యం ఉపనయనం బ్రాహ్మణులకు 8వ ఏట, క్షత్రియులకు 11వ ఏట, వైశ్యులకు 12వ ఏట ఉపనయనం చేయాలని వేదాలు చెబుతున్నాయి. ఉపనయం జరిగిన వ్యక్తిలో మానసికంగా శారీరకంగా బలం చేకూరుతుంది , అంతేకాదు ధరించిన తర్వాత మంచి ఫలితాలు పొందుతారు అని పండితులు చెబుతున్నారు.అన్ని కార్యక్రమాలకు పెద్దవారిగా గుర్తింపు వస్తుంది.