వింత జంతువు ఊరంతా టెన్ష‌న్ టెన్ష‌న్

వింత జంతువు ఊరంతా టెన్ష‌న్ టెన్ష‌న్

0
514

కొన్ని జంతువులు రాత్రి పూట ఊరిమీద ప‌డి ప‌శువుల‌ని చంపేస్తాయి, దీనిపై వార్త‌లు వ‌స్తాయి వెంట‌నే అట‌వీశాఖ ప‌శుశంవ‌ర్ద‌క శాఖ అధికారులు అల‌ర్ట్ అవుతారు, రాత్రి పూట రైతులు కూడా ఆ జంతువులు ఏమిటా అని చూస్తారు, దానిని త‌రిమికొడ‌తారు, కాని తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెనికేరులో ఓ వింత జంతువు స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

రోజూ రాత్రివేళల్లో పొలాల్లో సంచరిస్తున్న జంతువు పశువులను చంపేస్తోంది. ఇప్పటిదాకా ఇరవైకి పైగా పశువులు చనిపోయాయి. దీంతో రైతులు రాత్రుళ్లు నిద్రపోకుండా పొలాల దగ్గర కాపలా కాస్తున్నారు. దీని గురించి కంప్లైంట్ అయితే ఇవ్వ‌డం జ‌రిగింది..

ముఖ్యంగా ఇక్క‌డ ప‌శువుల‌ని అది టార్గెట్ చేసి చంపేస్తోంది, రాత్రి పూట బ‌య‌ట‌కు రావ‌డానికి చాలా మంది బ‌య‌ట‌ప‌డుతున్నారు..పశుసంవర్ధక శాఖ, అటవీ శాఖాధికారులు గ్రామంలో పర్యటించి వివరాలు సేకరించారు. ఆ జంతువుని ప‌ట్టేందుకు ప్ర‌త్యేక బోను ఏర్పాటు చేయాలి అని అంటున్నారు గ్రామ‌స్తులు.