రాసుకుని పూసుకుని తిరిగారు కదా? : బాలయ్య సంచలన కామెంట్స్

0
113

సీనియర్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘‘మా’’ నాయకత్వంపై గరం గరం కామెంట్స్ చేశారు. తెలంగాణ సిఎం కేసిఆర్ తో రాసుకుని పూసుకుని తిరుగుతారు కానీ అసోసియేషన్ కు ఒక భవనం ఎందుకు కట్టించలేకపోతున్నారని చురకలు వేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో అసోసియేషన్ కు బిల్డింగ్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ప్రశ్నించారు.

తెలంగాణ సర్కారుతో సత్సంబంధాలు ఉన్నప్పుడు అడిగితే ఒక ఎకరం ఇవ్వడా అని నిలదీశారు. ఏవైనా వివాదాలు ఉంటే గ్లామర్ ఫీల్డులో ఉన్న మనమంతా బహిరంగంగా చర్చించుకోవడం తగదు అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఆర్టిస్టులందరూ సమానమే అన్నారు బాలయ్య.

గతంలో నిధుల సమీకరణ పేరుతో అసోసియేషన్ సభ్యులు అమెరికా వెళ్లి వచ్చిన విషయాన్ని బాలయ్య గుర్తు చేశారు. ఫస్ట్ క్లాస్, టాప్ క్లాస్ ఫైట్లలో అమెరికా వెళ్లి చేసిన కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు ఏమయ్యాని నిలదీశారు.

మా భవనం నిర్మాణం విషయంలో మంచు విష్ణు ముందుకొస్తే, తాను సహకరిస్తానని చెప్పారు. సినీ పెద్దలంతా కలిసి వస్తే ఇంద్రభవనమే నిర్మించుకోవచ్చని చెప్పారు బాలయ్య.