అల్లుఅర్జున్ ‘శ్రీవల్లి’ స్టెప్​ వెనుక ఇంత పెద్ద సీక్రెట్ ఉందా?

0
102
Pushpa 2

సుకుమార్​ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్యూటీఫుల్ భామ ర‌ష్మిక నటించిన చిత్రం ‘పుష్ప‌’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. రెండో భాగం కూడా త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుందని చిత్రబృందం వెల్లడించింది. దాంతో అటు బన్నీ ఫ్యాన్స్, ఇటు రష్మిక అభిమానులు ఖుషి అవుతున్నారు.

ఈ చిత్రంలోని బన్నీ నటన, డైలాగ్స్​, సాంగ్స్​, సుకుమార్​ టేకింగ్​ ఇలా ప్రతీది దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీవల్లి సాంగ్​లో అల్లు అర్జున్ చెప్పు స్టెప్పు ప్రేక్షకులను, సెలెబ్రిటీలను తెగ అలరించింది. తాజాగా ఈ స్టెప్​ వెనకనున్న సీక్రెట్ ను​ అమితాబ్ రివీల్ చేసాడు.

బన్నీ గాగుల్స్​ పెట్టుకుని చెప్పుల్ని ఈడ్చుతూ స్టెప్పు వేయడం, చెప్పు జారిపోతే దానిని సరి చేసుకోవడం అభిమానులను బాగా ఆకట్టుకుంది. కానీ ఇందులో అల్లు అర్జున్ చెప్పు జారిపోవడం పొరపాటుగా జరిగింది. అది కొరియోగ్రఫీ కాదని బిగ్​బీ చెప్పుకొచ్చారు. కానీ సుకుమార్​కు అది నచ్చడంతో అలాగే ఉంచేశారట”. అలా అల్లు అర్జున్ పొరపాటుగా చేసిన చెప్పు స్టెప్ వైరల్​గా మారింది.