నటి మీనా భర్త మృతికి అసలు కారణం ఇదేనా?

0
123

సినీ నటి మీనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త విద్యాసాగర్​ కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.​ మంగళవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కాగా జనవరిలో మీనా కుటుంబం మొత్తానికి కరోనా వచ్చింది. ఆ తరువాతే విద్యాసాగర్ ఆరోగ్య సమస్య మరింత తీవ్రమైనట్లు తెలుస్తుంది.

అయితే విద్యాసాగర్ మృతిపై తమిళనాడు స్థానిక వార్త పత్రికల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్లే ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది. నటి మీనా నివసిస్తున్న ప్రాంతంలో పావురాలు అధిక సంఖ్యలో ఉంటాయి. వాటి వ్యర్థాల వల్ల వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్‌కు శ్వాసకోశ సమస్య తలెత్తిందని, అందుకే ఆయన కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్నారని పత్రికల్లో కథనాలు ప్రచూరితమయ్యాయి.

కాగా బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విద్యాసాగర్‌ను మీనా 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి నైనిక అనే కుమార్తె ఉంది. నైనిక కూడా కొన్నాళ్ల క్రితం తళపతి విజయ్​ హీరోగా తెరకెక్కిన ‘తెరీ’ చిత్రంతో అరంగేట్రం చేసింది. మీనా కూడా ఇటీవల దృశ్యం 2 సహా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.