Devara Release | ఎన్టీఆర్ ‘దేవర’ కొత్త విడుదల తేదీ వచ్చేసింది.. 

-

RRR వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తదుపరి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర (Devara)’ సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై హై భజ్ తీసుకొచ్చాయి. దీంతో తొలుత ఈ ఏడాది ఏప్రిల్ 5న మూవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

అయితే సినిమా షూటింగ్ ఆలస్యం కానుండటంతో విడుదల వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ మూవీ యూనిట్ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ ఏడాది దసరా పండుగ కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ఓ కొత్త పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో తారక్.. పవర్ ఫుల్ లుక్‌లో అదరగొట్టాడు.

కాగా ఎన్టీఆర్ (NTR)- కొరటాల శివ (Koratala Siva) కలయికలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇద్దరి కాంబోలో ‘దేవర (Devara)’ రానుండడంతో మూవీపై మంచి హైప్ ఏర్పడింది. అంతేకాకుండా ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్ (Saif Ali Khan) విలన్‌గా, తారక్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Read Also: ‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati...

పవన్ కల్యాణ్‌ను గెలిపించండి.. ప్రజలకు అన్నయ్య చిరంజీవి సందేశం..

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురంలో పోటీ చేస్తున్న...