కౌశల్ ఆర్మీ ఎవరి కోసం.. కత్తి మహేష్ కామెంట్స్

కౌశల్ ఆర్మీ ఎవరి కోసం.. కత్తి మహేష్ కామెంట్స్

0
60

బిగ్ బాస్ షో తో ఫేమస్ అయిన కత్తి మహేష్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేసి నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే.ఇక పవన్ కే డైరెక్ట్ సవాలు విసిరేలా కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కత్తి మహేష్ చేశాడు. అంతేకాదు రాముడు మీద కూడా కామెంట్ చేసి 6 నెలలు నగర బహిష్కరణకు గురయ్యాడు.

ఇదిలాఉంటే మళ్లీ కత్తి మహేష్ కొత్త టార్గెట్ తో వచ్చాడు. ప్రస్తుతం బిగ్ బాస్ 2లో అత్యధిక ఫాలోవర్స్ ఏర్పరచుకున్న కౌశల్ పై తన అక్కసు చూపిస్తున్నాడు. కౌశల్ ఆర్మీ మీద తన కామెంట్ పెట్టాడు కత్తి మహేష్. కౌశల్ ఆర్మీ ఉన్మాద చర్యలు ఆపాలని.. కౌశల్ ఆర్మీ పేరులోనే హింస ఉందని.. ఈ సైన్యం ఎవరి కోసం.. ఎవరికి సైన్యం.. అంటూ కామెంట్ చేశాడు.

కొన్నాళ్లుగా కత్తి కామెంట్స్ మాట వినపడలేదు. విషయం ఏదైనా తన పంథాలో కామెంట్ పెట్టే కత్తి మహేష్ ఇప్పుడు మళ్లీ కౌశల్ ఆర్మీని కెలుకుతున్నాడు. ఈమధ్య కౌశల్ కోసం చేసిన 2కే వాక్ ను ప్రస్థావిస్తూ కౌశల్ కోసం కన్నా కేరళ వరద బాధితుల కోసం చేసి ఉంటే మంచిదని అన్నారు.కరెక్ట్ టైంలో కరెక్ట్ టాపిక్ తో మళ్లీ హాట్ టాపిక్ గా మారే అంశాన్ని లేవనెత్తాడు కత్తి మహేష్. అతనితో డిస్కషన్స్ పెట్టొద్దని మీడియా ఛానెల్స్ కు గట్టి వార్నింగ్ వచ్చింది. మరి తన సోషల్ ఫ్లాట్ ఫాం మీదే మహేష్ కత్తి కౌశల్ ఆర్మీని టార్గెట్ చేస్తున్నాడు. మరి దీనిపై కౌశల్ ఆర్మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.