Kollywood |తమిళ హీరోలపై నిర్మాతలమండలి రెడ్ నోటీస్!

-

తమిళ హీరోలు, కోలీవుడ్‌(Kollywood) నిర్మాతల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. రెమ్యునరేషన్‌, అడ్వాన్సులు తీసుకుని డేట్స్‌ ఇవ్వడం లేదంటూ నిర్మాతలు ఆయా హీరోలపై మండిపడుతున్నారు. ఈ మేరకు శింబు(Simbu), విశాల్‌ (Vishal), అధర్వ, ఎస్‌జే సూర్య(Sj Surya), యోగిలకు రెడ్‌ నోటీస్‌ ఇచ్చినట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ వివాదంపై తమిళ నిర్మాతల మండలి స్పందించింది. ఇటీవల జరిగిన నిర్మాతల మండలి జనరల్‌ బాడీ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే హీరోలు తమ వాదనను మరోలా వినిపిస్తున్నారని సమాచారం. సరైన కథ లేకుండా వస్తే డేట్లు ఎలా ఇచ్చేదంటూ ప్రశ్నిస్తున్నారట. మరి ఈ వ్యవహారంలో నడిగర్ సంఘం, నిర్మాత మండలి(Kollywood Producers Council) ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ నటులను సినిమాల నుంచి బహిష్కరిస్తారా లేదా అనేది వేచి చూడాలి.

- Advertisement -
Read Also:
1. రూ.10 కోసం కక్కుర్తిపడి పోలీసులకు చిక్కిన గజదొంగ
2. మెగా కుటుంబాన్ని ఎప్పుడో టార్గెట్ చేశారు: పవన్ 

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...