ఎన్టీఆర్ సినిమాపై బిగ్ బాస్ విన్న‌ర్ కౌశల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఎన్టీఆర్ సినిమాపై బిగ్ బాస్ విన్న‌ర్ కౌశల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

0
82

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో జూ. ఎన్టీఆర్ హీరోగా తెకెక్కిన చిత్రం అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వేంద్ర. ఈ చిత్రం నిన్న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అయి బాక్సాఫీస్ ముందు క‌లేక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హీరో ఎన్టీఆర్, న‌టుడు జ‌గ‌పతిబాబు త‌మ పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు.

అయితే ఈ సినిమా బిగ్ బాస్ సీజ‌న్2 విన్న‌ర్ కౌశల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఓ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో ఆయ‌న మాట్లాడుతూ… తాను ఎన్టీఆర్ న‌టించిన చిత్రం అర‌వింద స‌మేత చిత్రం చూశాన‌ని ఈసినిమాలో జ‌గ‌ప‌తిబాబు, ఎన్టీఆర్ లు అద్బుతంగా న‌టించార‌ని అన్నారు.

అంతేకాదు ఈ చిత్రాన్ని చూసిన త‌ర్వాత తాను కూడా ఎన్టీఆర్ సినిమాలో విల‌న్ గా న‌టించాల‌నుకుంటున్నాన‌ని కౌశ‌ల్ త‌న మ‌న‌సులో మాట చెప్పారు. మ‌రో వైపు సోస‌ల్ మీడియాలో కౌశ‌ల్ ఆర్మీలో ఆయ‌న విల‌న్ గా న‌టిస్తే చూడాల‌ని ఉందంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మ‌రి కౌశ‌ల్ ఏ హీరో సినిమాలో విల‌న్ గా న‌టిస్తారో.