ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది హీరోయిన్ కృతి శెట్టి(Krithi Shetty). అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమా ఆఫర్లు కొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల తాను అక్కినేని హీరో నాగచైతన్యతో కలిసి నటించిన కస్టడీ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి.. తనకు ఎలాంటి భర్త కావాలో వివరించింది.
‘అందంగా ఉండక్కర్లేదు. ఆస్తి పెద్దగా ఉండాల్సిన పనిలేదు. మంచి మనసున్నవాడై ఉండాలి. మొహమాటం లేకుండా నిజాయితీగా తన అభిప్రాయాలను వ్యక్తపరచాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతో చాలా సింపుల్ గా ఉండాలి. కాస్త బొద్దుగా ఉంటే ఇష్టం’ అని చెప్పుకొచ్చారు. కృతి(Krithi Shetty) తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ చెప్పగానే అభిమానులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అమ్మాయిలు తమ ఫ్యూచర్ హస్బెండ్ అందంగా ఉండాలి, ఆస్తులు ఉండాలి అని కోరుకుంటుంటే.. కృతి మాత్రం ఆస్తి లేకపోయినా పర్వాలేదు కానీ అబ్బాయి సింపుల్ గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అని చెప్పడంతో.. ఆమె ఇన్ అండ్ అవుట్ సో బ్యూటిఫుల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also: కిడ్నీ సమస్యలకు ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి
Follow us on: Google News, Koo, Twitter