అమెరికాకు మహర్షి టీమ్

అమెరికాకు మహర్షి టీమ్

0
90

ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘మహర్షి’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇప్పుడు మహేష్ బాబు ఫారెన్ టూర్‌కు బయల్దేరుతున్నారు. పూజా హెగ్డే, అల్లరి నరేష్ అండ్ బ్యాచ్‌తో కలసి అమెరికాలో ఓ రెండు నెలలు బిజిబిజీగా గడపడానికి లగేజ్ సర్దుకుంటున్నారు. అక్కడే కీలక ఘట్టాలన్నింటినీ పూర్తి చేసి, న్యూ ఎనర్జీతో తిరిగి రావాలనుకుంటున్నారు…

అమెరికా, న్యూయార్క్, కాలిఫోర్నియా, లాస్ వేగాస్ లలో మహర్షి తదుపరి షెడ్యూల్ ని చెయ్యబోతున్నారు. ఆ షెడ్యూల్ లోనే సినిమాలోని అతి కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తాని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తూ వస్తున్నారు. సంఖ్యా పరంగా ఈ సినిమా మహేష్ కి ప్రత్యేకం కావడంతో, వంశీ పైడిపల్లి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.