ఈ నెల 6 తేదీన ప్రభాస్ కొత్త సినిమా లాంచ్

ఈ నెల 6 తేదీన ప్రభాస్ కొత్త సినిమా లాంచ్

0
74

ప్రభాస్ తాజాగా సాహో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . యువ దర్శకులు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది . అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సాహో చిత్రాన్ని తెలుగు , తమిళ్ , హిందీ బాషలలో నిర్మిస్తున్నారు . కాగా ఆ సినిమా పూర్తికాకుండానే జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రాన్ని పట్టాలెక్కించడానికి సమాయత్తం అవుతున్నాడు ప్రభాస్ . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 6న మంచి ముహూర్తం ఉండటంతో ఆరోజు ప్రభాస్
జిల్ రాధాకృష్ణ ల కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుందని తెలుస్తోంది .

ప్రేమ కథకు యాక్షన్ ని జోడించి స్క్రిప్ట్ రూపొందించినట్లు తెలుస్తోంది , జిల్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణకు ఇది గోల్డెన్ ఛాన్స్ ఎందుకంటే జిల్ సినిమా ప్లాప్ అయినప్పటికీ ప్రభాస్ కు నచ్చడంతో ఛాన్స్ ఇచ్చాడు . యూరప్ లో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకునే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించనుంది . బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరగడంతో తెలుగులోనే కాకుండా తమిళ హిందీ బాషలలో కూడా ఏకకాలంలో రూపొందిస్తున్నారు ప్రభాస్ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి .