మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వరుణ గండం.. ఫంక్షన్ ఆగే సూచన..!!

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వరుణ గండం.. ఫంక్షన్ ఆగే సూచన..!!

0
45

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం మహర్షి.. పూజ హెగ్డే కథానాయిక.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 9 న రిలీజ్ అవుతుండగా మే 1 న అంటే ఈరోజు ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపేందుకు సన్నాహాలు చేయగా, ఆ ఫంక్షన్ కి వరుణుడి అడ్డు తగిలేలా ఉంది.. ఈరోజు నెక్ లెస్ రోడ్ లో పీపుల్స్ ప్లాజా లో ఈ ఫంక్షన్ జరుగుతుండగా ఈ ఫంక్షన్ కి భారీగా అభిమానులు రానున్నారు..

అయితే ఈ ఫంక్షన్ కి వర్షం అంతరాయం కలిగించేలా ఉంది.. ప్రస్తుతం ఇక్కడ భారీ వర్షం వస్తుండగా ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైం కి వర్షం ఇంకా పెరిగే అవకాశం ఉంది.. దాంతో మేకర్స్ ఏం చేయాలా అనే సందిగ్ధం లో పడ్డారు.. దిల్ రాజు అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఇప్పటికే ఈ చిత్రం సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. మహేష్ 25 వ సినిమా గా రాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.. ఈ సినిమా తర్వాత మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.. అనిల్ సుంకర ఆ చిత్రానికి నిర్మాత.. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.