జగన్ గూటికి టీడీపీ మంత్రి

జగన్ గూటికి టీడీపీ మంత్రి

0
45

ఏపీలో ఎన్నికలు ముగిసిపోయినా రాజకీయ పార్టీల నేతలు, విశ్లేషకులు, మీడియాలో స్పెక్యులేషన్ అమాంతం పెరిగిపోయింది. ఒకరు జగన్ సీఎం అవుతారు అంటే, మరోకరు బాబు సీఎం అవుతారు అని అంటున్నారు.. అలాగే మీడియాలు పల్స్ తెలుసుకునే సంస్దలు కూడా ఎవరి సర్వే వారిది బయట వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఏ సర్వే చూసినా వైసీపీ గెలుపు పక్కా అని, సుమారు 125 స్ధానాలు గెలుచుకునే దిశగా ఉంది అని చెబుతున్నాయి. ఈ సమయంలో కొందరు తెలుగుదేశం నేతలు కూడా పార్టీ మారి వైసీపీలో ఖర్చీఫ్ వేసుకోవాలి అని చూస్తున్నారు.. తాజాగా ఉత్తరాంధ్రాలో ఓ మంత్రి ఇప్పుడు జగన్ సీఎం అయితే, తన సీటుని వైసీపీలో వేసుకోవాలి అని చూస్తున్నారు.

బాబు తాను కోరిన చోట సీటు ఇవ్వలేదు, తానుచెప్పిన వారికి కూడా టికెట్ ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసినా అయిష్టంగా ఆయన బరిలోకి దిగారట. ఇక్కడ ఆయన గెలిచినా గెలవకపోయినా వైసీపీలో చేరిపోతారట. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది టీడీపీలో, పైగా తెలుగుదేశం పార్టీ వీడటానికి ఇది మంచి అవకాశం అని కూడా ఆయన భావించారట.. సీటు ఇవ్వకపోవడం తనకు గుర్తింపు లేకపోవడం ప్రధాన కారణంగా ఆయన చెబుతున్నారట.. మరి ఫలితాలు వచ్చే వరకూ ఆయన ఉంటారా లేదా ముందే జంప్ అవుతారా అనేది తెలియాలి