మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ మధ్య లో వెళ్లిపోవడానికి కారణమే అదేనా..!!

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ మధ్య లో వెళ్లిపోవడానికి కారణమే అదేనా..!!

0
52

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.. వెంకటేష్, విజయ్ దేవరకొండ ముఖ్య అతిధులుగా జరిగిన ఈ ఫంక్షన్ కి యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించారు.. తెలుగులో పెద్ద హీరోలు ఎవరైనా సరే ఆమె యాంకరింగ్ చేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం.. ఫంక్షన్ మొదటి నుంచి చివరి దాకా ఆమె చేసే హంగామా అంత ఇంతకాదు.. అందుకే ఆమెనే యాంకర్ గా తమ షో కి ఏరికోరి ఎంచుకుంటారు సినీ ప్రముఖులు..

అయితే నిన్న మహర్షి ఫంక్షన్ లో సుమ ఫంక్షన్ మొదట కనిపించి ఆ తర్వాత కనిపించక పోవడంతో చాల మందికి చిన్న అనుమానం కలిగే ఉంటుంది.. అయితే సుమ ఎక్కడికెళ్లింది.. ఏమై ఉంటుంది అనే ఆలోచన తప్పకుండ అందరికి వచ్చే ఉంటుంది.. అయితే ఈ షో ని ఇద్దరు యాంకర్లతో చేయాలనీ చిత్ర యూనిట్ ముందుగానే భావించింది.. వెరైటీ గా ఉండాలని ఇలా ప్లాన్ చేయగా నూతన యాంకర్ గీత భగత్ సుమ తర్వాత షో ని హోస్ట్ చేసింది. ఇక మహేష్ మహర్షి సినిమా మే 9 రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.