విజయసాయిరెడ్డికి కొత్త పేరు టీడీపీ తగ్గడం లేదు

విజయసాయిరెడ్డికి కొత్త పేరు టీడీపీ తగ్గడం లేదు

0
48

వైసీపీ వర్సెస్ టీడీపీ అనే రేంజ్ కామెంట్లు ఇప్పుడు నాయకుల మధ్య జరుగుతున్నాయి.. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ కామెంట్లు ఆగడం లేదు. ఓ పక్క విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు తెలుగుదేశం నేతలపై. ఇక తెలుగుదేశం నేతలు కూడా సాయిరెడ్డిపై మీడియాముఖంగా విమర్శిస్తున్నారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జైల్ రెడ్డి అని కూడా విమర్శించారు. తాజాగా టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేత విజయసాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 13 కేసులలో నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్ది చంద్రబాబును విమర్శించడం తగువు కాదని అమె మండిపడ్డారు.

చిన్న చిన్న విషయాలకు కూడా సాయిరెడ్డి పిచ్చి ఎక్కిన వ్యక్తిగా ప్రవర్తిస్తున్నారు అని అన్నారు.. విజయసాయి రెడ్డికి బదులుగా విషపుసాయి రెడ్డి అని పిలిచే రోజులు దగ్గర పడ్దాయని, ఫలితాలు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతుంది అని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు..టీడీపీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా విజయసాయి రెడ్డి జైలుకెళ్ళడం ఖాయమని అనురాధా విమర్శించారు.. తెలుగుదేశం పార్టీ డేటాను దొంగిలించింది వైసీపీ నేతలే అని ఆమె విమర్శించారు.