సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Mahesh Trivikram) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా సినిమా గురించి మరో అప్టేడ్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నమోదుచేశాయి. ఈ క్రమంలో ఈనెల 31న కృష్ణ(Superstar Krishna) పుట్టిన రోజు సందర్భంగా మూవీ టైటిల్ రిలీజ్ చేయబోతున్నట్లు శుక్రవారం చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. మహేష్ బాబు వెనక వైపు నుంచి ఉన్న లుక్‌తో కొత్త పోస్టర్ విడుదల చేసింది. తలకు ఎర్ర కండువా కట్టుకుని, చేతితో సిగరేట్ తాగుతూ, చెక్స్ షర్ట్‌లో మహేష్ లుక్ ఊరమాస్‌గా ఉంది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఈసారి బాబు మరోసారి గట్టిగా హిట్ కొట్టబోతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. పూజా హెగ్దే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘గుంటూరు కారం’, ‘అమరావతికి అటు ఇటు’ టైటిల్స్ లో ఏదో ఒకటి ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టనున్నారని తెలుస్తోంది.
A MASS Feast For Fans and By Fans! #SSMB28MassStrike to thunder its way on ???? ???! ⚡?
SUPER FANS will unveil Striking video at the ????????!! ??
Super ? @urstrulyMahesh #Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli… pic.twitter.com/l3VKLuyqWP
— Haarika & Hassine Creations (@haarikahassine) May 27, 2023
Read Also:
1. సెక్స్ తర్వాత ఇలా చేస్తే మీ పార్ట్ నర్ హర్ట్ అయ్యే చాన్స్ ఉంది జాగ్రత్త..!
2. మహానాడు ఇప్పటివరకు ఎక్కడెక్కడ జరిగిందో తెలుసా?
Follow us on: Google News, Koo, Twitter