Yatra 2 Trailer | తండ్రి పోతే కొడుకొచ్చాడు.. ‘యాత్ర 2’ టీజర్ విడుదల..

-

Yatra 2 Trailer | ఏపీ సీఎం జగన్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర 2‘ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా టీజర్ విడుదల చేశారు. వైఎస్సార్ చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు, జగన్ జైలు జీవితం, పాదయాత్ర, సీఎం కావడం వంటి అంశాలను ఇందులో చూపించారు.

- Advertisement -

తమిళ హీరో జీవా జగన్ పాత్రలో నటించగా.. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్‌ కనిపించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 8న మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Yatra 2 Trailer | కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘యాత్ర 2’ సినిమాను రూపొందిస్తున్నారు.

Read Also: కేశినేనికి చెక్ పెట్టిన చంద్రబాబు.. నాని సంచలన ప్రకటన
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Delhi Elections | BJP మేనిఫెస్టోలో సంచలన హామీ?

Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్...

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...