సంతోషంలో మెగా అభిమానులు..’ఆచార్య’ రిలీజ్ ఎప్పుడంటే?

Mega fans happy .. When will 'Acharya' be released?

0
110

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఆచార్య’ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఫిబ్రవరి 4న రావాల్సిన ఈ చిత్రాన్ని కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థలు ట్వీట్ చేసింది. ఇప్పుడు కొత్త విడుదల తేదీని ప్రకటించి, ఫ్యాన్స్​లో జోష్ నింపింది.

కొరటాల శివ దర్శకత్వంలో దేవాలయాల నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్​గా చేసింది. రామ్​చరణ్, పూజాహెగ్డే కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు, టీజర్లు మెగా అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి.

తాజాగా వేసవి కానుకగా ఏప్రిల్ 1న థియేటర్లలోకి తీసుకొస్తామని పోస్టర్​ విడుదల చేశారు మేకర్స్. అయితే గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా, ఓమిక్రాన్ ప్రభావం సినీ పరిశ్రమపై ప్రభావం చూపిస్తోంది. రోజు రోజూకీ కేసులు గణనీయంగా పెరుగుతున్న క్రమంలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న సంక్రాంతి రోజున ఆచార్య సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దీంతో మెగా అభిమానులు నిరాశ చెందారు. ఇప్పుడు కొత్త తేదిని ప్రకటించి మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది చిత్రబృందం.

https://twitter.com/KonidelaPro?