మహర్షి సిమాపై మీనాక్షి.. షాకింగ్ కామెంట్స్..!!

మహర్షి సిమాపై మీనాక్షి.. షాకింగ్ కామెంట్స్..!!

0
122

దూకుడు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు టైటిల్ సాంగ్ లో ఆడి పాడిన భామ మీనాక్షి దీక్షిత్. అయితే ఈమె చాలా కాలం తెరపై కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కలిసి నటించానంటుంది. ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటించారు.కాగా మహర్షి సినిమా పై మీనాక్షి మీడియాతో మాట్లాడారు.

మహర్షి సినిమా గురించి డైరెక్టర్ వంశీ పైడిపల్లి తనను సంప్రదించినప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. అయినా తన కోసం కొన్ని రోజులు ఆగి మళ్లీ ఫోన్ చేశారని, అప్పటికి నా ఆరోగ్యం కుదటపడకపోయినా తన కోసం షూటింగ్ ఆపినందుకు చేస్తానని చెప్పారు. డెంగ్యూ, టైఫాయిడ్‌తో బాధపడుతూ మంచానికే పరిమితమైనా, క్రేజీ ఆఫర్ రావడంతో మూడు వారాల్లోనే నార్మల్‌ కావడంపై అందరూ ఆశ్చర్యపోయారన్నారు.

మహర్షి సినిమాలో మహేష్ కు సహఉద్యోగిగా నటించానని, న్యూయార్క్ కంపెనీలో మహేష్‌తో కలిసి పనిచేసే పాత్రలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పడిందనుకొంటున్నాను. రిషి జీవితంలో మంచి, చెడు సంఘటనల మధ్య నా పాత్ర తిరుగుతుంది అని మీనాక్షి దీక్షిత్ చెప్పారు. వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నారు.