నాగార్జునకు మోదీ నుంచి పిలుపు దేనికో తెలిస్తే షాక్

నాగార్జునకు మోదీ నుంచి పిలుపు దేనికో తెలిస్తే షాక్

0
67

టాలీవుడ్ లో ఎందరు హీరోలున్నా మన్మధుడు నాగార్జునకు ఉన్న ఫాలోయింగ్ ఆయనకే సొంతం ..లేడీ ఫ్యాన్స్ ఆయనకు ఇప్పటికీ ఎక్కువే. యువత ముఖ్యంగా నాగ్ స్టైల్ ని ఇష్టపడతారు.. ఇక తాజాగా ఎన్నికల సమయం కావడంతో,సినీ సెలబ్రెటీలతో కాస్త పొలిటిషియన్లకు పని ఉంటుంది. అవును ఎవరు చెప్పినా వింటారో వినరో తెలియదు కాని, సినిమా హీరోలు చెబితే కచ్చితంగా వింటారు ప్రేక్షక మహాశయులు.. ఇది పసిగట్టాయి అన్ని రాజకీయ పార్టీలు.. అందుకే సోషల్ ఎక్స్ పెర్మెంట్ అలాగే సోషల్ గా కొత్త కొత్త విధానాలు చెప్పాలి అన్నా ఇప్పుడు ఇలాంటి వాటికి ప్రజల్లో మార్పుకి సినీ సెలబ్రెటీలను వాడుతున్నారు.

ఈ విషయంలో టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో.. తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లను చైతన్య పర్చాలంటూ ఆయనకు మోదీ సూచించారు. మీరు ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు చేసి అందరిని అలరించారు..మీనటనతో లక్షల మంది ఆధారాభిమానాలు సంపాదించారు. అలాగే పలు అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు. చాలా ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్న మీరు, ఇప్పుడు జరుగబోయే ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరిగేలా ఓటర్లను చైతన్య పరచాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ప్రధాని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు..దీనికి వెంటనే నాగ్ కూడా ఇలా ప్రచారం చేయడానికి ఒకే చెప్పారు అని తెలుస్తోంది, త్వరలో ఈ క్యాంపెయినింగ్ కు రెడీ అవుతున్నారట కింగ్ నాగార్జున.