లవర్ మూవీ రివ్యూ

లవర్ మూవీ రివ్యూ

0
133

చిత్రం : ‘లవర్’
నటీనటులు: రాజ్ తరుణ్ – రిద్ధి కుమార్ – సచిన్ ఖేద్కర్ – రాజీవ్ కనకాల – రోహిణి – జీవా – రాజా రవీంద్ర – ప్రవీణ్-సత్య – సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్ – అంకిత్ తివారి – ఆర్కో- రిషి రిచ్ – అజయ్ వ్యాస్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాత: హరీష్ రెడ్డి
రచన – దర్శకత్వం: అనీష్ కృష్ణ

కథ
సొంత గ్యారేజిలో మెకానిక్ గా పనిచేస్తుంటాడు రాజ్ (రాజ్ తరుణ్). అయితే రాజ్ కు బ్యాంకాక్ టూర్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాడు. ఈ నేపథ్యంలోనే తన అన్నయ్య జగ్గూ భాయ్ (రాజీవ్ కనకాల)ను ఓ ప్రమాదం నుంచి కాపాడతాడు రాజ్. ఆ సమయంలో రాజ్ గాయపడడంతో ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఆసుపత్రిలో చరిత (రిద్ధికుమార్) పరిచయం అవుతుంది రాజ్ కు. ఆమెను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు రాజ్. ఆమెను ఎలాగైనా ప్రేమలోకి దించడానికి ప్రయత్నిస్తాడు రాజ్. చివరకు చరిత ఒప్పుకుంటుంది. ఇదిలా ఉండగా చరితపై అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ నుంచి రాజ్ ఆమెను కాపాడతాడు. చరితను ఎవరు ఎందుకు అటాక్ చేశారు ? చరితకు వాళ్లకు ఉన్న సంబంధం ఏమిటి ? వాళ్ళ నుంచి చరితను ఎలా కాపాడుకుంటాడు రాజ్ ? అనేది వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
రాజ్ తరుణ్ లవర్ గా ఎప్పటిలాగే ఎనర్జిటిక్ గా కన్పించాడు. ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోవడం కోసం తపనపడే యువకుడిగా బాగా నటించాడు. ఇక రిద్ధికుమార్ కు ఇది తెలుగులో మొదటి సినిమా… అయినా కూడా ఎక్కడా తగ్గకుండా తన పాత్రలో ఒదిగిపోయింది. ఆమె పాత్ర సినిమాలో కీలకం. రాజీవ్ కనకాల తనదైన శైలిలో నటించాడు. సచిన్ ఖేడేకర్, అజయ్, సుబ్బరాజ్ విలన్ గ్యాంగ్ గా అలరించారు. ఇక హీరో ఫ్రెండ్స్ చేసిన కామెడీ ప్రయత్నం ఫలించలేదు.

ప్లస్ పాయింట్స్ :

రాజ్ తరుణ్ గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. చిత్తూరు యాసలో మాట్లాడిన ఆయన మాడ్యులేషన్ కూడా బాగుంది. తన కామెడీ టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక కథానాయకిగా నటించిన రిద్ధికుమార్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ని ప్రేమలో పడేయటానికి చేసే ప్రయత్నాలకు సంబంధించిన సన్నివేశాలు, హీరోయిన్ మదర్ కు హీరోకు మద్య సాగే కేరళ సన్నివేశాలు బాగా అలరించాయి.

జగ్గు అనే వీధి రౌడీగా నటించిన రాజీవ్ కనకాల మరో మంచి పాత్ర చేశారు. ఆయన తన నటనతో ఏమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పండించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేసారు. ఎప్పటిలాగే అజయ్ తన గాంభీరమైన నతనతో ఆకట్టుకోగా సత్యం రాజేష్, సత్య తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో ఉన్నంతలో బాగానే నవ్వించారు.

‘అలా ఎలా’చిత్రంతో హిట్ కొట్టిన దర్శకుడు అనీశ్ కృష్ణ‌. మరోసారి అలాంటి ప్రయత్నమే చేసారు. ఫస్ట్ హాఫ్ ని సరదాగా నడిపిన అయన సెకండాఫ్ ను మాత్రం కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేసారు. సినిమాలో కార్ హ్యాంకింగ్ అనే కొత్త పాయింట్ ను టచ్ చేసి సినిమాలో కొత్తదనం తెచ్చే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

మొదటి భాగం సరదాగా సాగిన, రెండువ భాగం మాత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. దానికి కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించినట్లు అనిపిస్తోంది. ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ చాలా సింపుల్ గా తేల్చేసారు.

రాజ్ తరుణ్, సత్య, సత్యం రాజేష్ లాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ లు ఉన్నా వారి టాలెంట్‌ని వాడుకునేంతగా సన్నివేశాలు లేకపోవడంతో వాళ్ళు కూడా చాలా సేపు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. రాజీవ్ కనకాల క్యారెక్టర్ మంచి ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ క్యారెక్టర్ ఎండ్ చేసిన విధానం అంత సంతృప్తికరంగా ఉండదు.

సినిమాలో మంచి స్టోరీ లైన్ ఉన్నా, సినిమాలో విలువైన భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలకి స్కోప్ ఉన్నా, దర్శకుడు మాత్రం ఆ దిశగా ఆలోచినట్లు కనిపించలేదు. పైగా ప్రతి సన్నివేశం సినిమాటెక్ గానే బోర్ గానే సాగుతుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రెడిక్టుబుల్ గా నడుస్తుంది.

చివరగా:లవర్ పరవాలేదు అనిపించుకున్నాడు

రేటింగ్ : 2.5/5