ఆర్ ఎక్స్ 100 మూవీ రివ్యూ

ఆర్ ఎక్స్ 100 మూవీ రివ్యూ

0
142
RX 100

చిత్రం: ‘ఆర్ ఎక్స్ 100’
నటీనటులు: కార్తికేయ – పాయల్ రాజ్ పుత్ – రావు రమేష్ – రాంకీ తదితరులు
సంగీతం: చేతన్ – స్మరణ్
ఛాయాగ్రహణం: రామ్
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ
రచన – దర్శకత్వం: అజయ్ భూపతి

క‌థ‌:

అత్రేయ పురంలో జెడ్‌.పి.టి.సి విశ్వనాథం(రావు ర‌మేశ్‌), డాడి(రాంకీ) మంచి స్నేహితులు. డాడి.. శివ‌(కార్తికేయ‌)ని పెంచి పెద్ద చేస్తాడు. సెల‌వుల‌కు ఊరికి వ‌చ్చిన విశ్వ‌నాథం కూతురు ఇందు(పాయ‌ల్ రాజ్‌పుత్‌) శివ‌ను ప్రేమిస్తుంది. శివ కూడా ఇందుని ప్రేమిస్తాడు. ఇద్ద‌రూ జంట‌గా తిరుగుతుంటారు. పెళ్లి విష‌యం మాట్లాడ‌తాన‌ని ఓ రోజు ఇందులో ఇంటికి వెళుతుంది. కానీ ఆమె తండ్రి విశ్వ‌నాథం బ‌ల‌వంతంతో మ‌రో పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. శివ‌ను విశ్వ‌నాథం మ‌నుషులు కొట్టి ప‌డేస్తారు. ఇందు అమెరికా వెళ్లిపోతుంది. ఇందు ప్రేమ‌లో శివ పిచ్చివాడిలా మూడేళ్లు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓరోజు ఇందు అత్రేయ‌పురం వ‌స్తుంది. అప్పుడు శివ ఆమెను క‌ల‌వ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు. కానీ ఇందు శివ‌ను క‌ల‌వ‌దు. ఎందుకు? అస‌లు శివ‌, ఇందు మ‌ధ్య ప్రేమ నిజమేనా? చివ‌ర‌కు శివ‌, ఇందుల ప‌రిస్థితేంటి? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే

నటీనటులు:

హీరో కార్తికేయ బాగానే చేశాడు. సినిమా అంతటా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోయాడు కానీ పతాక సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. కార్తకేయ లుక్ ఆకట్టుకుంటుంది. పాత్రకు తగ్గ ఆహార్యంతో శివ మెప్పించాడు. హీరోయిన్ కంటే కూడా అతనే ఎక్కువగా బాడీని ఎక్స్ పోజ్ చేయడం విశేషం. డైలాగ్ డెలివరీ విషయంలో కార్తికేయ కొన్ని చోట్ల తడబడ్డాడు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సినిమాకు పెద్ద ఆకర్షణ. పాత్రకు తగ్గట్లుగా సాగిన ఆమె బోల్డ్ నెస్ కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. పాయల్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇలాంటి పాత్ర చేయడానికి గట్స్ ఉండాలి. చాలా ఆత్మవిశ్వాసంతో నటించి మెప్పించింది. రావు రమేష్ తన అనుభవాన్ని చూపించాడు. విశ్వనాథం పాత్రలో ఆయన ఒక సన్నివేశంలో అదరగొట్టేశాడు. రాంకీ కూడా మెప్పిస్తాడు. మిగతా నటీనటులంతా ఓకే.

బోట‌మ్ లైన్‌: ఆర్‌.ఎక్స్ 100… ప్రేమ‌లో కొత్త యాంగిల్

రేటింగ్: 2.5/5