10 కోట్ల క్లబ్ లో చేరిన RX100

10 కోట్ల క్లబ్ లో చేరిన RX100

0
92

బాగా హాట్ గా రొమాంటిక్ సీన్లతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా చాలా అంటే చాలానే ప్రేక్షకాదరణ సంపాదించుకుంది..

టాలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్టుగా క్రేజ్ సంపాదించుకొన్న RX 100 చిత్రం వసూళ్ల సునామీని సృష్టిస్తున్నది. ఈ చిత్రానికి ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ, వస్తున్న కలెక్షన్లను చూసి ట్రేడ్ వర్గాలు కంగుతింటున్నాయి. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 10 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించడం సినిమా స్టామినాకు అద్దంపడుతున్నది.

వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో నూతన నటీనటులు కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ నటించిన ఈ చిత్రం గురువారం రిలీజైన సంగతి తెలిసిందే.

రిలీజ్ అయినా రెండు రోజులకే అంటే ఆదివారం నాటికే సుమారు రూ.2.5 కోట్లు ఆంధ్ర,ఓవర్సీలో కలిపి రూ.2.5 కోట్లు కలెక్షన్ పెనంలో దూసుకు పోతుంది.ఇప్పటికే RX100 చిత్రం డిస్టిబ్యూటర్లకు విపరీతమైన లాభాలను పంచిపెడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.