శైలజ రెడ్డి అల్లుడు మూవీ రివ్యూ

శైలజ రెడ్డి అల్లుడు మూవీ రివ్యూ

0
156

చిత్రం : శైల‌జా రెడ్డి అల్లుడు
నటీనటులు : నాగ‌చైత‌న్య‌, ర‌మ్యకృష్ణ‌, అను ఇమ్మాన్యూల్‌, మురళీ శర్మ, న‌రేష్‌, వెన్నెల కిశోర్‌
సంగీతం : గోపి సుంద‌ర్
దర్శకత్వం : మారుతి దాస‌రి
నిర్మాత : ఎస్ రాధ‌కృష్ణ‌, నాగ‌వంశీ ఎస్‌, పీడీవీ ప్ర‌సాద్

క‌థ :
చైతన్య (నాగ చైతన్య ) భయంకరమైన ఈగో ఉన్న సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మెన్‌ రావు(మురళీ శర్మ) కొడుకు. తన ఈగో కోసం కూతురు పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకునేంత ఈగో రావుది. తన కాలనీ లోకి కొత్తగా వచ్చిన అను(అను ఇమ్మాన్యూల్) అనే అమ్మాయి తొలిచూపులోనే ఇష్టపడతాడు చైతూ.. అనుకి కూడా తన తండ్రిలాగే భరించలేనంత ఈగో ఉందని తెలిసి పని మనిషిని ప్రేమిస్తున్నట్లుగా నాటకమాడి అనుని ప్రేమలోకి దించుతాడు. అనుకి కూడా తనలాగే ఈగో ఎక్కువ అని తెలుసుకున్న రావు.. చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఫ్యామిలీ ఫంక్షన్‌లో అను పర్మిషన్ లేకుండా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసేస్తాడు. (సాక్షి రివ్యూస్‌) కానీ అదే సమయంలో అను.. వరంగల్ జిల్లాను శాసించే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ) కూతురు అని తెలుస్తోంది. తనకి తెలియకుండా ఏది జరగడానికి ఇష్టపడని శైలజా రెడ్డి… చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకుందా..? ఈగోని పక్కన పెట్టి శైలజా రెడ్డి, రావు.. చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకున్నారా? అన్నదే మిగతా కథ.

ప్ల‌స్ పాయింట్స్‌:
న‌టీన‌టులు
సినిమాటోగ్ర‌ఫీ
ఫ‌స్టాఫ్
రెండు పాటలు

మైన‌స్ పాయింట్స్‌:
బ్యాగ్రౌండ్ స్కోర్‌
మారుతి గ‌త చిత్రాల స్థాయిలో కామెడీ లేక‌పోవ‌డం
సెకండాఫ్ లెంగ్తీగా అనిపించ‌డం
ద‌ర్శ‌క‌త్వం
పాత్ర‌లు, వాటిని తెరకెక్కించిన తీరు

చివరిగా – రొటీన్ స్టోరీ…….కామెడీ తో నడిపించారు

రేటింగ్ – 2.75