తనీష్ కు వార్నింగ్ ఇచ్చిన దీప్తి భర్త

తనీష్ కు వార్నింగ్ ఇచ్చిన దీప్తి భర్త

0
68

యంగ్ హీరో తనీష్ బిగ్ బాస్ షో లో టీవీ యాంకర్‌ దీప్తి నల్లమోతుతో టాస్క్‌లలో పైశాచికంగా ప్రవర్తిస్తోన్న తనీష్‌ పట్ల చాలా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమ్మ అమ్మ అని పిలుస్తూనే పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడు .అయితే రిలేషన్స్‌కి వేల్యూ ఇస్తానని, టాస్క్‌లలో అలా ఆడక తప్పడం లేదని తనీష్‌ వివరణ ఇచ్చుకుంటున్నాడు. ఎక్కడ దీనిని ఎత్తి చూపిస్తే భాను, తేజస్విలా ఎలిమినేట్‌ అవుతుందోననే భయంతోనో ఏమో అతడికి గట్టిగా ఎదురు చెప్పలేదు. పైగా తనపై దాడి చేయడమే కాకుండా పదే పదే దీప్తిని నామినేట్‌ చేస్తుంటాడు తనీష్‌.

ఇక టీవీ9 దీప్తి భర్త అయితే వెళుతూ వెళుతూ ‘ఫిజికల్‌ టాస్క్‌లు ఆడేటప్పుడు కొంచెం చూసుకోండి’ అని ఒక చురక వేసి పోయాడు. దాంతో అదంతా బయటకి ఎలా కనిపిస్తుందనేది తనీష్‌కి తెలిసి వచ్చినట్టుంది. వెంటనే స్మోకింగ్‌ రూమ్‌లో దూరి బాధ పడిపోవడం మొదలు పెట్టాడు. సామ్రాట్‌ వచ్చి ‘భర్త కదా. ఆమాత్రం కన్సర్న్‌ వుంటుంది’ అంటూ నచ్చ చెప్పాలని చూసాడు.