సవ్యసాచి మూవీ రివ్యూ

సవ్యసాచి మూవీ రివ్యూ

0
164

చిత్రం – సవ్యసాచి
నటి నటులు – నాగచైతన్య,నిధి అగర్వాల్,మాధవన్
నిర్మాత – నవీన్,రవి
సంగీతం – కీరవాణి
డైరెక్టర్ – చందూ మొండేటి
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వరావు

కథ –
విక్రమ, ఆదిత్య్ ( చైతు ) వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కారణంగా.. ఒక బాడీలోనే ఇద్దరు కలిసి పుడతారు. విక్రమ్ ఆదిత్యకు తన అక్క భూమిక కూతురు మహాలక్ష్మి అంటే ప్రాణం. ఆ పాపలో చనిపోయిన తన తల్లిని చూసుకుంటుంటాడు. ఇదే క్రమంలో విక్రమ్, తన లవర్ చిత్ర (నిధి అగర్వాల్) మళ్ళీ ఆరు సంవత్సరాల తరువాత కలుసుకుంటారు. ఇలా అంత హ్యాపీగా జరిగిపోతున్న క్రమంలో విక్రమ్ మేనకోడలు (భూమిక కూతురు) కిడ్నాప్ కి గురి అవుతుంది. అసలు ఆ కిడ్నాప్ చేసింది ఎవరు ? అరుణ్ (మాధవన్ )కి ఆ కిడ్నాప్ కి ఏమైనా సంబంధం ఉందా ? ఒకవేళ అరుణే ఆ కిడ్నాప్ చేసి ఉంటే.. ఎందుకు చేసి ఉంటాడు ? ఇంతకీ అరుణ్ కి, విక్రమ్ ఆదిత్య కు మధ్య వైరం ఏమిటి ? అరుణ్ ఎందుకు ఇవ్వన్నీ చేస్తున్నాడు ? చివరకి విక్రమ్, అరుణ్ నుండి తన మేనకోడలని కాపాడుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలయాలంటే ఈ చిత్రం తప్పక చూడాల్సిందే.

నటి నటులు –
నాగ‌చైత‌న్య సింపుల్ గా ఉన్నాడు. ఇది వ‌ర‌క‌టి సినిమాల కంటే అందంగా క‌నిపిస్తున్నాడు. అలాగ‌ని త‌న బ‌ల‌హీన‌త‌ల్ని దాచుకోలేక‌పోయాడు. అక్క‌డ‌క్క‌డ బ‌య‌ట‌పడుతూనే ఉన్నాయి. నిధి అగ‌ర్వాల్ చూడ్డానికి బాగుంది. అంత వ‌ర‌కే. మాధ‌వ‌న్ ఈ సినిమా మొత్తాన్ని త‌న భుజాల‌పై వేసుకుని న‌డిపించేస్తాడ‌నుకుంటారంతా. కానీ… ఆ పాత్ర‌ని మ‌నం ఊహించుకున్న స్థాయిలో డిజైన్ చేయ‌లేదు. దాదాపుగా మాధ‌వ‌న్ ది సోలో ప‌ర్‌ఫార్మెన్సే. ఫోన్‌లో మాట్లాడ‌డానికే ఎక్కువ కాల్షీట్లు ఇచ్చి ఉంటాడు. భూమిక ఓకే. వెన్నెల కిషోర్‌, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ లేక‌పోతే. మొదటి పార్ట్ బోరింగ్‌గా అనిపించేది.

ప్లస్ పాయింట్స్ –
మంచి పాయింట్‌
నాగ‌చైత‌న్య‌, మాధ‌వ‌న్ పెర్‌ఫార్మెన్స్‌
ప్రీ క్లైమాక్స్‌

మైనస్ పాయింట్స్ –
నెరేష‌న్ స‌రిగ్గా లేక‌పోవ‌డం
ఫ‌స్టాఫ్ బోరింగ్‌
హీరో, విల‌న్ మ‌ధ్య ఆస‌క్తిక‌రంగా లేని మైండ్ గేమ్‌

రేటింగ్ -2.5/5