రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ‘కల్కి 2898 AD’ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఈ ఏడాది మే9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి రోజుకొక వార్త బయటకు వస్తూ మూవీపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఇంట్రస్టింగ్ విషయం వెల్లడించాడు.
కల్కి 2898AD సినిమా మహాభారతం నుంచి మొదలై 2898లో పూర్తవుతుందన్నారు. అందుకే సినిమాకు ఆ టైటిల్ పెట్టామని.. సినిమాలో 6000 సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తున్నామని వెల్లడించారు. ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్స్ ఆధారంగా సినిమా తీస్తున్నామని.. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశామని తెలిపారు. దీంతో కల్కి సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటించనుండగా.. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రానా, తదిరతరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్.. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.