అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), కృతి శెట్టి(Krithi Shetty) జంటగా నటించిన ‘కస్టడీ’ చిత్రం ఓటీటీ(Custody OTT) స్ట్రీమింగ్ ఖరారైంది. ఈనెల 9వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సంస్థ అధికారికంగా ప్రకటించింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం మే 12న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నిజాయతీ కలిగిన ఓ కానిస్టేబుల్ ఒక భయంకరమైన నేరస్థుడిని ఎలా చట్టానికి అప్పగించాడనే కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్ ముఖ్యపాత్రలను పోషించగా.. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా ఇద్దరు కలిసి సంగీతం అందించారు. థియేటర్లలో అభిమానులను నిరాశపర్చిన ‘కస్టడీ’ ఓటీటీలో(Custody OTT) అయినా మంచి టాక్ అందుకుంటుందో లేదో చూడాలి.