నాగార్జున సినిమా కి టీజర్ డేట్ ఫిక్స్..!!

నాగార్జున సినిమా కి టీజర్ డేట్ ఫిక్స్..!!

0
81

2002లో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా రానున్న ఈ సినిమాపై అటు టాలీవుడ్ లోను ఇటు అక్కినేని ఫ్యాన్స్ లోను ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నాగ్ సరసన అదరగొట్టే బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా ముగ్గురు ముద్దుగుమ్మలైన కీర్తి సురేష్, సమంత, అక్షర గౌడలు స్పెషల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను అక్కినేని నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ మరియు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని ఈనెల 13వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్లు ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలుండడంతో ఒకవేళ ఎల్లుండి విడుదలయ్యే టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే మాత్రం సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతాయి అని అంటున్నారు సినీ విశ్లేషకులు.