పదవి ఇవ్వలేదని అలిగిన రోజాను కల్సిన సీఎం జగన్‌..!!

పదవి ఇవ్వలేదని అలిగిన రోజాను కల్సిన సీఎం జగన్‌..!!

0
65

అమరావతి: తాడెపల్లిగూడెంలోని క్యాంప్ ఆఫీస్‌లో సీఎం జగన్‌ను ఎమ్మెల్యే రోజా కలిశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తనకు మంత్రి పదవి వస్తదని ఎమ్మెల్యే రోజా ఆశించారు. అయితే కేబినెట్‌లో ఆమెకు చోటు దక్కలేదు. దీంతో ఆమె అలకబూనినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు జూన్-08న అమరావతిలో జరిగిన కొత్త మంత్రుల స్వీకారోత్సవానికి రోజా హాజరుకాలేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. విషయం తెలుసుకున్న సీఎం జగన్.. రోజాను క్యాంప్ ఆఫీస్‌కు రావాల్సిందిగా కబురు పంపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం అమరావతికి వచ్చిన రోజా.. సీఎం జగన్‌ను కలిశారు. దీంతో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇదిలాఉండగా ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవికి బదులుగా నామినెటెడ్ పదవి ఇచ్చే యోచనలో జగన్ ఉన్నారని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. ఆమెకు మంచి పదవి ఇస్తారని ఊహాగానాలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన రోజా తనకు పదవి ఇస్తామని ఎవరూ చెప్పలేదని స్పష్టం చేశారు. అవన్నీ గాలివార్తలేనని కొట్టిపారేశారు. తనకు మంత్రి పదవి దక్కలేదని తనకు ఏమాత్రం బాధలేదన్నారు. కులాల ఈక్వేషన్ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదన్నారు. మంత్రి పదవి ఇవ్వనందుకు తాను అలిగానని వస్తున్న వార్తలు మీడియా సృష్టేనని కొట్టిపారేశారు.