మిడిల్ క్లాస్ అబ్బాయిగా బ్రతుకుతున్న నాగ చైతన్య

మిడిల్ క్లాస్ అబ్బాయిగా బ్రతుకుతున్న నాగ చైతన్య

0
92

అక్కినేని మూడవ తరం హీరో నాగచైతన్య సపరేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి… యువత ఎక్కువగా చైతూ నటనకు సినిమాలకు ఫిదా అవుతూ ఉంటారు.. ఇక సమంతని పెళ్లి చేసుకున్న తర్వాత నాగ చైతన్య లైఫ్ మరింత కలర్ ఫుల్ గా ఉంది అని చెప్పాలి.. ఇప్పుడు ఇద్దరు పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.. తాజాగా ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం మజిలీ.. శివనిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకోసం ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు..ఈ సినిమా ఏప్రియల్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతోంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య పలు విషయాలు మాట్లాడారు,

తన చిన్నతనం బాల్యం గురించి కూడా మీడియాతో ముచ్చటించారు. తన స్కూలింగ్ అంతా చెన్నైలో అయింది అని.. అక్కడ తాను చాలా మిడిల్ క్లాస్ అబ్బాయిగా లైఫ్ గడిపాను అని చెప్పాడు చైతూ..తనని అమ్మ స్టార్ హీరో కొడుకులా పెంచలేదు అని తను స్టార్ హీరో కొడుకు అని ఎవరికి తెలియదు అని చెప్పాడు చైతూ, ఇక బర్ద్ డే పార్టీలు లగ్జరీ లైఫ్ కి దూరంగా ఉన్నాను అని చెప్పాడు నాగచైతన్య.