జగన్ ని ఓడించేందుకు షర్మిల ప్రచారం

జగన్ ని ఓడించేందుకు షర్మిల ప్రచారం

0
87

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇచ్చే విధంగా వైయస్ విజయమ్మ వైయస్ షర్మిల ఎన్నికల ప్రచారం ఉంటుంది అని అనుకున్నారు.వైసీపీ నాయకులు.. కాని ఎన్నికల ప్రచారం ఎలా ఉన్నా ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.. ప్రజలకు వైయస్ జగన్ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఆమె తెలియచేస్తున్నారు.. ఇక్కడ వరకూ బాగానే ఉంది. అన్న సీఎం అయ్యేందుకు మరొకరిని తగ్గించి మాట్లాడటం పై మహిళా సమాజం విమర్శలు చేస్తోంది వైయస్ షర్మిలపై.

మంత్రి నారా లోకేష్ కాస్తో కూస్తో అభివృద్ది పనులుచేశారు. ఆయనకంటూ ఓ ఫాలోయింగ్ ఉంది, రాజకీయాల్లో ఎన్నికల సమయంలో తన అన్నకోసం ప్రచారం చేసే వైయస్ షర్మిల ఏ పదవులు లేకుండా ప్రజలకు ఎలాంటి సాయం చేయకుండా, ఇప్పుడు లోకేష్ పై విమర్శలు చేయడం పై పెద్ద ఎత్తున తెలుగుదేశం నేతలు అలాగే కొందరు ప్రజలు కూడా ఆమెని విమర్శిస్తున్నారు.. అసలు లోకేష్ ని నేరుగా పప్పు అని విమర్శిస్తున్న ఆమె, కాస్త ఆచితూచి మాట్లాడాలి అని , ఈ ఎన్నికల్లో జగన్ కోసం కుటుంబం కుటుంబం ప్రచారం చేస్తోంది అని చంద్రబాబు కుటుంబం ఇలా ఎన్నికల్లో ప్రచారం చేయడం లేదు అని గమనించాలి అని తెలుగుదేశం నేతలు విమర్శలు చేస్తున్నారు.