అనంతలో జేసి దూకుడుకి వైసీపీ బ్రేక్

అనంతలో జేసి దూకుడుకి వైసీపీ బ్రేక్

0
36

అనంతపురం జిల్లాలో ఓటమి ఎరుగని నేతగా జేసికి పేరు ఉంది… కాని ఈసారి రాజకీయాల్లో పోటీ చేయకుండా ఆయన కుమారులని ఎన్నికల బరిలోకి దింపుతున్నారు జేసి సోదరులు.. ముఖ్యంగా దివాకర్ రెడ్డి ఆయన కుమారుడ్ని అనంతపురం ఎంపీగా బరిలోకి దించుతున్నారు.. ఆయన కుమారుడు పవన్ రెడ్డి ఎంపీగా అనంతపురం నుంచి పోటీ చేస్తున్నారు… అయితే ఓటమి ఎరుగని నాయకుడి కుమారుడు ఓ వైపు ఉంటే, వైసీపీ తరపున కీలక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రజల మన్ననలు పొందిన ఉద్యోగిని తీసుకువచ్చారు జగన్.. టీడీపీకి అండగా ఉన్న బీసీ ఓట్లను కొల్లగొట్టే ఉద్దేశంతో బోయ వర్గానికి చెందిన డీఆర్డీఏ మాజీ ప్రాజెక్టు డైరెక్టర్ తలారి రంగయ్యను అభ్యర్థిగా నిలబెట్టారు.

గడిచిన ఎన్నికల్లో జేసి ఓటమి ఖాయం అనుకున్నారు. కాని ఇప్పుడు ఆయన కుమారుడ్ని ఎన్నికల బరిలోకి దించడం వల్ల మరోసారి గెలుపు కష్టం అని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ రెడ్డి ఇక్కడ గెలుపు కోసం కష్టపడుతున్నారు. ఏడు సెగ్మెంట్లలో అభ్యర్దుల మార్పు విషయంలో జేసి తన పట్టు నిలబెట్టుకున్నారు. కొన్ని చోట్ల ముఖ్యంగా జేసి కుమారుడికంటే రంగయ్యకు అనేక సర్వేలు పాజిటీవ్ గా వచ్చాయి, అయితే జేసి కంచుకోటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాజకీయంగా అనంతలో వైసీపీ దూసుకుపోతుంది అని అంటున్నారు ఇక్కడ పార్టీ నేతలు.