ఈసారి గొడ్డలితో వైలెన్స్ అంటున్న బాలయ్య.. NBK 109 షూటింగ్ మొదలు..

-

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తీసిన దర్శకుడు బాబీ NBK 109 సినిమాకు దర్శతక్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నేడు మొదలైనట్లు తెలియజేస్తూ మూవీ యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో “బ్లడ్ బాత్ కి బ్రాండ్ నేమ్”, “వైలెన్స్ కి విజిటింగ్ కార్డు” క్యాప్షన్‌తో ఓ గొడ్డలికి ఆంజనేయస్వామి లాకెట్‌తో పాటు కళ్లజోడు ఉంది. ఆ కళ్లజోడులో పోరాట సన్నివేశాలు చూపించారు. దీంతో ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు.

- Advertisement -

NBK 109 | అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు బాలయ్య. సీనియర్ హీరోల్లో వరుసగా మూడు చిత్రాలు రూ.100కోట్ల క్లబ్‌లో చేరిన హీరోగా రికార్డు సృష్టించారు. దీంతో బాలయ్య నటించే తర్వాతి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే బాబీ(Bobby) దర్శకత్వంతో సినిమాకు కమిట్ అయ్యారు. ఇటీవల పూజా కార్యక్రమం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. “ప్రపంచానికి ఇతను తెలుసు, కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు” అనే కొటేషన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులకు ఆకట్టుకుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Read Also: హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణాలేంటి? న్యాచురల్ గా ఎలా పెంచుకోవచ్చు?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...