మొత్తానికి మా అసోషియేషన్ ఎన్నికలు ముగిసాయి. ఈ ఎలక్షన్స్ లో నరేష్ గెలిచాడు . నిన్న నరేష్ ప్రమాణ స్వీకారం కూడా చేసేసారు. ఈ ప్రమాణ స్వీకారానికి రాజశేఖర్, జీవిత, కృష్ణం రాజు, హేమ పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారందరి సమక్షంలో నరేష్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక ఈ నేపధ్యంలో వేదిక పైన జీవిత మాట్లాడిన తరువత హేమ మాట్లాడాలని భావించారు. కానీ దానికి నరేష్ ఒప్పుకోలేదు, హేమ చేతిలో నుండి మైక్ లాగేసుకున్నారు, దాంతో హేమ ఆ అవమానాన్ని తట్టుకోలేక అక్కడున్న వారందరి పైన గొడవ పడుతూ చిరాకుగా కనిపించారు. ఇది గమనించిన రాజశేఖర్ సరే మాట్లాడు అంటూ మైక్ ఇచ్చాడు. ఇదేం బాగాలేదు.. నాట్ గుడ్ అని హేమ అసహనం వ్యక్తం చేసింది. నరేష్ గారు ప్రకటించిన అంశాలన్నీ ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయాలే. మమ్మల్ని ఇంతరవరకు సంప్రదించలేదు.కనీసం మీటింగ్ లో కూడా చెప్పలేదు అని హేమ తెలిపింది.