పబ్జీ గేమ్ ఆడే వారికీ షాకింగ్ న్యూస్

పబ్జీ గేమ్ ఆడే వారికీ షాకింగ్ న్యూస్

0
80

ఇప్పటి నుండి ఇండియా లో 6 గంటలకంటే ఎక్కువ పబ్జీ ఆడకుండా ఆట కట్టు విధించారు. దీంతో తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు . గేమ్స్ అంటే ఇష్టపడని వారు సైతం ఒక్కసారి పబ్జీ ఆడితే దానికి బానిస అవుతున్నారు. అయితే రాను రాను అది ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ గేమ్ను ఆడుతూ చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. పబ్జీని నిషేధించాలని ఇండియాలో పెద్ద ఎత్తున నిరసన జరుగుతోంది. స్వచ్ఛంద సంస్థల నుంచి రాజకీయ పార్టీల వరకు ఈ గేమ్ పై చర్యలు తీసుకోవాలని అని డిమాండ్ చేస్తున్నారు.

పబ్జీ గేమ్ నుంచి విముక్తి పొందడానికి ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది . ఇండియాలో ఎవరైనా పబ్జీ గేమ్ 6 గంటలు ఆడగానే ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది. 24 గంటల తరువాత మళ్లీ ఈ గేమ్ను ఆడుకోవచ్చు. ప్లేయర్స్ హెల్త్ రిమైండ్ పేరుతో ఓ మేసేజ్ రాగానే గేమ్ ఆగిపోతుంది. ఆ గేమ్ ప్రవేశపెట్టిన కంపెనీపై భారత్ ఒత్తిడి తెచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారంగా మాత్రం ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.