బాబు మనవడ్ని కూడా వదిలిపెట్టని వర్మ

బాబు మనవడ్ని కూడా వదిలిపెట్టని వర్మ

0
52

రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అని చెప్పాలి.. అసలు వర్మ లక్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసిన సమయం నుంచి, తెలుగుదేశం నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.. టీజర్ ట్రైలర్ సాంగ్స్ కే శివాలెత్తుతున్నారు.. ఇక సినిమా మొత్తం చూస్తే ఎమీ చేస్తారా అనే అనుమానం అందరికి కలుగుతోంది. మొత్తానికి ఈసినిమాలో ఎవరు టార్గెట్ అనేది అందరికి తెలుసు.. అందుకే ఎన్నికల ముందు ఈసినిమా విడుదల చేయకూడదు అని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేస్తున్నారు.. మొత్తానికి కోర్టు వరకూ సెన్సార్ బోర్డు వరకూ వెళ్లారు, అయితే ఈనెల 29న వెండి తెరపై ఈ సినిమా విడుదల అవ్వబోతోంది.

ఇక పబ్లిసిటీ అంటే బాబు అని చెప్పాలి , అలాంటిది వర్మ ఏకంగా ఆయన సినిమాకి చంద్రబాబునే పబ్లిసీటీగా వాడేసుకుంటున్నారు.. చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ ని ఎత్తుకొని ఉన్న ఫోటోని మార్ఫ్ చేసి, బాబు మనవుడు ప్లేస్ లో వర్మ తల తగిలించేసి వినూత్నంగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఇక టీడీపీ గురించి చెబుతున్నారా లేదా మన గుర్తు ఇది అని చెబుతున్నారో కాని ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇదిమాత్రం అందరిని ఆకట్టుకుంటోంది.. ట్విట్టర్ లో పెట్టిన ఈ ఫోటో ఇప్పుడు పెద్ద వైరల్ అయింది. మరి విడుదలకు రెండు రోజుల ముందు నుంచి వర్మ మరింత క్రియేటివిటీ చూపిస్తారు అంటున్నారు ఆయన అభిమానులు.